పోడు భూములకు పట్టాలిస్తాం- సీఎం కేసీఆర్
తెలంగాణలో 66 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయన్నారు. 11 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామన్నారు. కొందరు గుత్తికోయలు చాలా ఆటవికంగా వ్యవహరిస్తున్నారన్నారు. సాగు చేసుకునేందుకు గిరిజనులకు భూములిస్తామన్నారు. అడవులను నరికేయడం కరెక్ట్ కాదన్నారు సీఎం కేసీఆర్. పోడు భూములు కొందరికి ఆట వస్తువుల్లా మారాయన్నారు. విచక్షణారహితంగా అడవులను నరకడం కరెక్ట్ కాదన్నారు. అదే సమయంలో గిరిజనులపై దౌర్జన్యం జరక్కుండా చూసుకోవాలన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఇప్పుడీ సమస్య జఠిలమైందన్నారు. రాష్ట్రంలో గిరిజనుల హక్కులను కాపాడతామన్నారు. దళితబంధు తరహాలో గిరిజన బంధు ఇస్తామన్నారు సీఎం కేసీఆర్.

