లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. నిందితుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత మాజీ సహాయకుడు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో చార్టెడ్ ఎకౌంటెంట్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ 2వ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో బుచ్చిబాబు పాత్రతోపాటుగా, హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్ లైసెన్సీల యజమానులకు లాభం కలిగించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ కుమార్తె కవితను గతంలో డిసెంబర్ 12న హైదరాబాద్‌లో ఈడీ విచారించింది. లిక్కర్ పాలసీ కేసులో కిక్‌బ్యాక్‌ల నుండి లబ్ది పొందిన సౌత్ గ్రూప్‌లో కవిత భాగమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది.


