టీమ్ ఇండియాకు మియందాద్ శాపం
వారు నరకానికి వెళ్ళొచ్చు, ఐసిసి ఇండియా క్రికెట్ టీమ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. పాక్ క్రికెట్ దిగ్గజం జావేద్ మియాందాద్. పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియా కప్‌లో పాల్గొనకూడదనే నిర్ణయంపై… కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరారు. ఐసీసీ నిబంధనలు కఠినంగా ఉండాలన్నాడు. ఆయా దేశాలు కొన్ని దేశాల టూర్లకు రాకపోతే, వారు ఎంత బలంగా ఉన్నా, వారిని తొలగించాలన్నారు మియాందాద్. భారతదేశం పాకిస్తాన్‌లో ఓడిపోయే సందర్భంలో ప్రజల విపరీతమైన ప్రవర్తనకు భయపడి టీమ్ ఇండియా, పాకిస్తాన్ టూర్‌కు రావడానికి భయపడుతుందన్నారు. ఒకవేళ ఓడిపోతే వెనక్కి వెళ్లేందుకు భారత్ జట్టు భయపడి… పాకిస్థాన్ పర్యటనకు మోహం చాటేస్తుందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు మియాందాద్ సమాధానమిచ్చాడు. తాము క్రికెట్ ఆడే రోజుల్లోనూ… పర్యవసానాలకు భయపడి, ఆడేవారు కాదని… భారత్‌లోని ప్రేక్షకులు ‘దుష్టులు’. భారతదేశం ఎవరికి వ్యతిరేకంగా అయినా ఓడిపోయినప్పుడల్లా , వారు ఇళ్లను తగలబెడతారని… అందుకే వారు భయపడుతున్నారని పాకిస్తానీ మాజీ బ్యాటర్ అభిప్రాయపడ్డాడు. చివరికి, ఈవెంట్‌లలో కూడా ఆడటానికి నిరాకరిస్తోన్నందున ఇండియాపై ICC కఠిన చర్యలు తీసుకోవాలని మియాందాద్ అన్నాడు. ఇలా నిషేదిస్తూ పోతే ఇక దానికి అంతే లేకుండా పోతుందన్నాడు. ఏదైనా దేశం ఇలా ప్రవర్తిస్తే, పరిణామాలు తీవ్రంగా ఉండాలని… అలాంటి జట్లను నిషేదించాలన్నాడు.

