Home Page SliderTelangana

రెండేళ్ల తర్వాత గవర్నర్ తమిళిసై ప్రసంగం

ఎట్టకేలకు గవర్నర్ తమిళిసై తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. రెండేళ్ల తర్వాత ఆమె తెలంగాణ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. హైకోర్టు జోక్యంతో అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌కు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉత్కంఠకు తెరదించుతూ ప్రజాకవి కాళోజీ పలుకులతో గవర్నర్ స్పీచ్ ప్రారంభించారు. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిదని కాళోజీ అన్నట్టుగా దేశానికి తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి చేరిందన్నారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని… కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించామన్నారు. రైతుబంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందిందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామన్న గవర్నర్… అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేస్తున్నామన్నారు. 125 అడుగులు ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను 3 నుంచి 17కి పెంచామన్నారు. ఈ ఏడాది నుంచే మరో 9 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామిక ఐటీ రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోందన్నారు. 140 శాతం మేర ఐటీ ఉద్యోగాలు పెరిగాయన్నారు ఇక యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతమని గవర్నర్ పేర్కొన్నారు. ఐతే గవర్నర్ మొత్తం స్పీచ్‌లో కేంద్రంపై ఎక్కడా విమర్శలు లేవు.