మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదానికి గురైన సుఖోయ్, మిరాజ్ యుద్ధ విమానాలు
భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు – సుఖోయ్ -30, మిరాజ్ 2000 – మధ్యప్రదేశ్లో శిక్షణ సమయంలో కూలిపోయాయి. రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఉదయం బయలుదేరాయి. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మోరెనాలో స్థానికులు చిత్రీకరించిన దృశ్యాలు… నేలపై ఉన్న విమాన శిధిలాలను చూపిస్తున్నాయి. రెండు జెట్లు ఒకదానికొకటి గాలిలో ఢీకొన్నాయో లేదో అధ్యయనం చేయడానికి ఎయిర్ ఫోర్స్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసిందని రక్షణ వర్గాలు తెలిపాయి. గగనతలంలోనే విమానాలు ఢీకొన్నాయా లేదా అనేది నిర్ధారించడానికి IAF కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ నియమించింది. Su-30కి ఇద్దరు పైలట్లు ఉండగా, ప్రమాదం జరిగినప్పుడు మిరాజ్ 2000కి ఒక పైలట్ ఉన్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని తెలుస్తోంది. IAF ఛాపర్ మూడో పైలట్ వివరాల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
