తమిళనాడులో EPS Vs OPS
మరోసారి రెండు వర్గాల మధ్య పంచాయితీ
సుప్రీం కోర్టును ఆశ్రయించేపనిలో EPS
ఫిబ్రవరి 27న ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ ఎన్నిక
పార్టీపై పట్టు కోసం పళనిస్వామి వ్యూహాలు
తమిళనాడులో కీలక ఎన్నికకు ముందు, అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ డిప్యూటీ ఓ పన్నీర్‌సెల్వంతో విభేదాల నేపథ్యంలో స్పష్టత కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. తాను ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అని పళనిస్వామి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. పన్నీర్ సెల్వం నిర్వహిస్తున్న కోఆర్డినేటర్ పదవి రద్దు చేయబడిందని ఆయన చెబుతున్నారు. ఈరోడ్ అసెంబ్లీ ఎన్నికల కోసం EPS తాను ఎంచుకున్న ఏ అభ్యర్థికైనా పార్టీ “రెండు ఆకులు” గుర్తును కేటాయించవచ్చని… దానిపై OPS సంతకం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఏఐఏడీఎంకే రాజ్యాంగం ప్రకారం అభ్యర్థుల కోసం ఇద్దరు నేతలు సంతకం చేయాల్సి ఉంది.

అన్నాడీఎంకేపై అధికారం కోసం ఈపీఎస్, ఓపీఎస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికలకు ముందు OPS తనకు ఇబ్బందులు సృష్టిస్తాడని… పార్టీ గుర్తును స్తంభింపజేస్తాడన్న ఆందోళనలో EPS ఉన్నారు. పార్టీ అభ్యర్థిపై సంతకం చేయడానికి ఎన్నికల కమిషన్ తనను అనుమతించేలా చూడాలని EPS సుప్రీంకోర్టును కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఫిబ్రవరి 27న ఎన్నిక జరగనుంది. ఈవీకేఎస్ ఇళంగోవన్ కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమారన్ మరణంతో ఈ నియోజకవర్గం ఖాళీ అయ్యంది. అన్నాడీఎంకేకు, ఈపీఎస్, ఓపీఎస్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గాలు తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

అధికార డీఎంకే, ఎదుర్కోడానికి బీజేపీతో అవగాహనకు ఇరువులు నేతలు ప్రయత్నిస్తున్నారు. EPS గత సంవత్సరం OPS ను బహిష్కరించారు. అప్పటి నుండి, ఇద్దరు నాయకులు ఒకరినొకరు పార్టీ పగ్గాల కోసం పోటీ పడుతూనే ఉన్నారు. తన బహిష్కరణను ఓపీఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు ఎన్నికల కార్యాలయం ఇటీవల EPS, OPS ఇద్దరినీ “కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్”గా సమావేశానికి ఆహ్వానించింది. మొత్తం పరిణామాలతో EPS సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.