Home Page SliderNews AlertTelangana

హైదరాబాద్‌వాసులు అలర్ట్‌.. మరోసారి చైన్ స్నాచింగ్‌..

హైదరాబాద్‌లో మరోసారి చైన్‌ స్నాచింగ్‌ కలకలం రేగింది. ఎల్‌బినగర్‌లోని బైరామల్‌గూడకు చెందిన ఓ వృద్దురాలు నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలోని మూడు తులాల బంగారం గొలుసును ఓ వ్యక్తి లాక్కొని పరారయ్యాడు. టువీలర్‌పై వచ్చిన చైన్‌ స్నాచర్‌ తన బైక్‌ను పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్లి వృద్ధురాలి మెడలోని గొలుసును లాగేశాడు. వెంటనే పరుగెత్తుతూ బైక్‌ ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి… పరారీలో ఉన్న దొంగను పట్టుకొనే పనిలో పడ్డారు.