శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. ఎయిర్పోర్ట్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ..స్మగ్లింగ్‌ను కట్టడి చేయలేకపోతున్నారు. కొందరు కేటుగాళ్లు కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి కిలోల మేర బంగారాన్ని అక్రమంగా దేశాలకు తరలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా దాదాపు రూ.33 లక్షల విలువైన 533 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ బంగారాన్ని మొబైల్‌ఫోన్ కవర్లో దాచి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర నుంచి బంగారాన్ని పట్టుకున్న అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు.