ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌ను బహిష్కరించిన ఆసీస్
ఆస్ట్రేలియా క్రికెట్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా ఆఫ్ఘానిస్తాన్‌తో జరగాల్సిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి ఆస్ట్రేలియా తప్పుకుంది. అమ్మాయిల విద్య, ఉద్యోగాలపై ఆఫ్ఘాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ సిరీస్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆప్ఘాన్‌తో పాటు అన్ని దేశాల్లో మహిళల క్రీడలకు సపోర్ట్ చేస్తామని పేర్కొంది. ఆఫ్ఘాన్ మహిళల క్రికెట్‌పై ఆంక్షలను సహించేది లేదని ఆసీస్ తెలిపింది. ఆస్ట్రేలియా.. ఆఫ్ఘానిస్తాన్ విషయంలో ఇలా వ్యవహరించడం ఇది తొలిసారి కాదు. గతంలో హోబర్ట్‌లో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను ఇదే కారణంగా చూపి రద్దు చేసింది. అయితే.. ఈ సీరిస్ నుంచి తప్పుకోవడం వల్ల 30 పాయింట్లు ఆఫ్ఘాన్ ఖాతాల్లోకి వెళ్ళనున్నాయి.

