ఐపీఎల్ నుంచి రిషబ్ ఔట్
ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ టోర్నీకి స్టార్ క్రికెట్ ప్లేయర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో రిషబ్ అందుబాటులో ఉండడని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, ఢిల్లీ క్యాపిటల్స్ టీం డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ప్రకటించారు. ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. ముంబైలోని ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు చెప్పాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6-8 నెలలు పడుతుందని తెలుస్తోంది. దీంతో అతడు ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. కాగా.. రిషబ్ పంత్ ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.. అంతేకాక రిషబ్ పంత్ తన తొలి ప్రదర్శన చేసినప్పటి నుంచి అంటే 2016 నుంచి కూడా ఢిల్లీ జట్టులోనే కొనసాగుతున్నాడు.

