తెలంగాణా హైకోర్టుకు సెలవులు
ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ హడావిడి మొదలయ్యింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు,పాఠశాల,కళాశాలలకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణా హైకోర్టుకు కూడా సెలవులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం రేపటి నుంచి ఈ నెల 17 వరకు తెలంగాణా హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా ఈ నెల 18న తిరిగి తెలంగాణా హైకోర్టు ప్రారంభంకానుంది.