Home Page SliderInternational

గాల్లో ఉండగానే తెరుచుకున్న విమానం డోర్‌… టెన్షన్‌లో ప్రయాణికులు

గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ విమానంలో ఒక్కసారిగా డోర్‌ తెరుచుకుంది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని కంగారు పడ్డారు. రష్యాకు చెందిన ఏఎన్‌ 26 ట్విన్‌ ప్రాప్‌ ఇర్‌ ఎయిరో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇర్‌ ఎయిరో సంస్థకు చెందిన విమానం సైబీరియాలోని మగాన్‌ నుంచి టేకాఫ్‌ తీసుకుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత మైనస్‌ 41 డిగ్రీలుగా ఉంది.  రష్యా పసిఫిక్‌ తీరంలోని మగాన్‌కు వెళుతుండగా ప్రయాణం మధ్యలో విమానం వెనుక డోర్‌ తెరుచుకుంది. ఆ సమయంలో విమానంలో 25 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు క్రూ సిబ్బంది. ఈ ఘటనతో ప్రయాణికులు సేఫ్‌గా ఉన్నారు. విమానం దిశను మార్చుకుని మగాన్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2800-2900 మీటర్ల ఎత్తులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఇర్‌ ఎయిరో సంస్థ తెలిపింది. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు తన ఫోన్లో చిత్రీకరించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.