Home Page SliderNational

“ప్లీజ్ రామ్ చరణ్” అంటూ షారుక్ రిక్వెస్టు

బాలీవుడ్ బాద్‌షాగా పేరుపొందిన షారుక్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. రామ్‌చరణ్ ప్లీజ్ అంటూ రిక్వెస్టు చేసుకున్నాడీ సుల్తాన్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించి, రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా ఇప్పటికే ఆస్కార్‌ నామినేషన్లకు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై షారుక్ ఖాన్ స్పందిస్తూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ఆసినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చి, ఇండియాకు తీసుకువస్తే దయచేసి తనకు ఒక్కసారి దానిని తాకే అవకాశం ఇమ్మని రామ్ చరణ్‌ను కోరుతున్నాడు. ఈ 95 వ ఆస్కార్ బరిలో ఈ సినిమాతో పాటు కాంతార, గంగుభాయ్ కతియావాడి, కాశ్మీర్ ఫైల్స్ లాంటి 10 సినిమాలు కూడా క్వాలిఫై అయ్యాయి. అయితే చాలామంది ప్రముఖుల అభిప్రాయం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ ఖాయమైపోయింది. దీనితో షారుక్ ఇలా స్పందించి ఉంటాడు. షారుక్ పోస్టుకి రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఓ వైపు షారుక్, దీపికా నటించిన పఠాన్ మూవీపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుని, ఈ నెల 25న విడుదల కాబోతోంది.