సూర్యకుమార్ అదృష్టవంతుడు.. ఒకవేళ పాక్‌లో ఉంటే బాధితుడు..
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌పై పాక్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ ఒకవైపు పొగుడుతూ.. మరోవైపు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ సూర్యకుమార్ పాక్‌లో పుట్టి ఉంటే అతడికి జాతీయ జట్టులో చోటు లభించేది కాదన్నాడు. “సూర్యకుమార్ 30 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడని విన్నాను. అతడు భారతీయుడు కావడం అదృష్టం. అయితే.. అతడు పాక్‌లో పుట్టి ఉంటే 30 ఏళ్ల పాలసీకి బాధితుడిగా మిగిలేపోయేవాడు. 30 ఏళ్లు వచ్చేసరికి ఎవరైనా జాతీయ జట్టులో ఉంటే మంచిదే.. ఒకవేళ లేకపోతే వారికి అవకాశాలు రావు. అయితే.. సూర్య 30 ఏళ్లకే టీమిండియాలోకి వచ్చాడు. అతడి ఫిట్‌నెస్, బ్యాటింగ్ శైలితో ఆటలో అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలర్ ఏ బంతి వేయబోతున్నాడో ముందే అతడికి తెలిసిపోయినట్లు ఆడతాడు అని సూర్యకుమార్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు. పీసీబీ ఛైర్మన్‌గా రమీజ్ రజా ఉన్న సమయంలో 30 ఏళ్ల విధానం అనుసరించారు. ఈ విధానంలో 30 ఏళ్లు నిండిన ఆటగాడికి ఇంటర్నేషనల్ టీంలో ఆడటానికి నో ఎంట్రీ ఉండేది. తాజాగా సూర్యకుమార్‌ను ఉదాహరణగా చెబుతూ పీసీబీ వైఖరిని సల్మాన్ భట్ బయటపెట్డాడు.