శ్రీలంకతో నేడు అమీతుమీ
ఇవాళ జరగబోయే 3వ టీ20 మ్యాచ్ లో భారత్, శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాజ్‌కోట్ వేదికగా రాత్రి 7 గంటల నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. రెండు జట్లు ఇప్పటికే 1-1 తో మ్యాచ్‌తో సమంగా ఉన్నాయి. 3వ టీ20 మ్యాచ్‌లో హోరాహోరీ పోరు ఉండనుంది. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో భారత్ నిలకడలేమి ప్రదర్శనతో ఇబ్బంది పడుతుంటే.. శ్రీలంక మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శననిస్తూ సత్తా చాటుతోంది. భారత్ మొదటి మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్టరీ, రెండవ మ్యాచ్ లో ఘోర పరాజయం మూట గట్టుకుంది. ఇటు బ్యాటర్లు, బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే, రెండవ టీ20లో గెలిచిన లంక జోరు మీదుంది. సీరీస్ ఫలితం తేల్చే ఈ మ్యాచ్‌లో జోరు కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
జట్ల అంచనా:
భారత్ : ఇషాన్ కిషన్ (wk), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా (c), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్.
శ్రీలంక : ప్రథుమ్ నిస్సంకా, కుశాల్ మెండిస్ (wk), ధనంజయ డిసిల్వా, చరిత అసలంక, భానుక రాజపక్సే, దసున్ శనక (c), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహీష్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశనక.