సినిమా ఫక్కీలో భార్యకు విడాకులిచ్చి, తమ్ముడితో పెళ్లి
“శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలున్నట్లు” కొన్ని సంఘటనలు వింతగా జరుగుతూ ఉంటాయి. మొదటిభార్య ఉండగానే రెండోపెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. గంటలోపే ఆమెకు విడాకులు ఇచ్చి తమ్ముడితో వివాహం జరిపించాడు. ఈ వింత సంఘటన యూపీలోని సంభాల్ అనే ఊరిలో జరిగింది. సైద్ నగలి అనే గ్రామంలోని ఓవ్యక్తికి నాలుగేళ్ల క్రిందట వివాహమైంది. అతని భార్య ఏవో గొడవలతో తన పుట్టింటికి వెళ్లిపోయిందట. అతను మరో యువతితో సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకుని మొదటిభార్య పెళ్లిమండపంలోనే పంచాయితీ పెట్టింది. పోలీస్ కేసు పెడతానని బెదిరించింది. తాను ఉండగా రెండవ వివాహం చెల్లదని హెచ్చరించింది. దీనితో పెద్దలు కలుగజేసుకుని అతని రెండవభార్యకు అప్పటికప్పుడే విడాకులు ఇప్పించి, అతని తమ్ముడికిచ్చి వివాహం చేశారు. కలికాలం అని అందరూ సరిపెట్టుకోవడమే.