Andhra PradeshHome Page SliderNews Alert

మృతుల్లో చంద్రబాబుకు కులం కనిపించడం రాష్ట్రానికి పట్టిన ఖర్మ : మంత్రి మేరుగు నాగార్జున

కందకూరు సభలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా మరణించిన వారి విషయంలో చంద్రబాబుకు కులం కనిపించడం రాష్ర్టానికి పట్టిన ఖర్మ అని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. కార్యకర్తలు చనిపోతే ఇది తన తప్పు కాదు కార్యకర్తలకు క్రమశిక్షణ లేదని తప్పు కార్యకర్తల మీద తోసేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు అవమానించడమేనని విమర్శించారు. చనిపోయిన వాళ్లలో నలుగురు ఎస్సీలు, అందులో ఇద్దరు మాలలు, మరో ఇద్దరు మాదిగలు, ఒక యానాది మహిళ, మరో బీసీ, మిగిలిన వాళ్లు ఓసీలంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తూ శవాల మీద పేలాలు ఏరుకునేలా తయారయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేద, బడుగు బలహీన వర్గాలు వారిని సభకు వస్తే డబ్బులు ఇస్తామని తీసుకొచ్చి, జనం ఎక్కువగా వచ్చారని చూపించడం కోసం ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, దానివల్ల చనిపోయిన ఆ బలహీన వర్గాల ప్రాణాల విలువ నువ్విచ్చిన ఎక్సగ్రేషియా‬ సరితూగుతుందా? అని మంత్రి ప్రశ్నించారు. చనిపోయిన తరువాత వారి కులాలను తీసుకొచ్చి ఓట్లు అడుక్కోవడానికి, వాళ్ళు నా వెనక ఉన్నారని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు.