Andhra PradeshHome Page SliderNews Alert

ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. 2023 ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. కేవలం 6 పేపర్లకు మాత్రమే పరీక్షలను నిర్వహించనున్నారు.  ఏప్రిల్‌ 3న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 6న సెకండ్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 8 – ఇంగ్లీష్‌, ఏప్రిల్‌ 10 – మ్యాథ్స్‌, ఏప్రిల్‌ 13 – సైన్స్‌, ఏప్రిల్‌ 15 – సోషల్‌, ఏప్రిల్‌ 17 – కాంపోజిట్‌ కోర్సు, ఏప్రిల్‌ 18 – ఒకేషనర్‌ కోర్సు . ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొంది.