Andhra PradeshHome Page SliderPolitics

బ్రతికున్నంత కాలం మీకే ఓటేస్తా…

టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇంటిని చూపుతూ.. ప్యారీ అనే మహిళ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి కాళ్లుపట్టుకొని కృతజ్ఞతలు తెలిపింది. ప్రభాకర్‌ చౌదరి అనంతపురంలోని రంగస్వామినగర్‌లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభాకర్‌ చౌదరి దయ వల్లనే ఇల్లు వచ్చిందని ప్యారీ అనే మహిళ సంతోషం వ్యక్తం చేసింది. తను బ్రతికున్నంత కాలం వారికి తప్ప.. వేరే ఎవరికీ ఓటు వేయనంటూ ప్రభాకర్‌ చౌదరికి మహిళ తెలిపింది. వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం చేశారని ప్రభాకర్‌ చౌదరి జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.