శ్రీశైల మల్లన్న సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
◆ శ్రీశైలంలో 43.08 కోట్లతో ప్రసాదం స్కీం పనులు ప్రారంభం
◆ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో గిరిజనులతో భేటీ
ఏపీలోని శ్రీశైలం మల్లన్న మహా పుణ్యక్షేత్రంలో 43.08 కోట్లతో ప్రసాదం స్క్రీం కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాష్ట్రపతి శ్రీశైలం పర్యటనలో భాగంగా ఉదయం 11.45 గంటలకు ఆమె సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడనుండి భ్రమరాంబ అతిథి గృహం కి చేరుకొని తదనంతరం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం ఆలయం వద్దకు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ కమిషనర్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్కృతి శాఖ మంత్రి రోజా, దేవస్థాన అధికారులు అర్చకులు తదితరులు రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో ఆమె కు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భారత రాష్ట్రపతి రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారికీ కుంకుమార్చన జరిపించారు. అక్కడనుండి టూరిజం ఫెసిలియేషన్ సెంటర్ శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం నంది సర్కిల్ సమీపంలో టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్లో 43.08 కోట్లతో చేపట్టిన ప్రసాదం ప్రాజెక్టును రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీశైలం మహా క్షేత్రంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన చెంచు విద్యార్థులతో చెంచు మహిళలతో రాష్ట్రపతి ముఖాముఖి నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని జీవన విధానాలను మార్చుకోవాలని వారికి సూచించారు.


