తెలుగు కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు
తెలుగు కవులు వారాల ఆనంద్, మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. ఈ పురస్కారం కింత తామ్రఫలకం, 50 వేల నగదును అందజేయనున్నారు. అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన ఆకుపచ్చ కవితలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ప్రముఖ కవులలో ఒకరైన పద్మభూషణ్ గుల్జార్ భావకవి. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లో కవిత్వం రాశారు. గుల్జార్ రాసిన గ్రీన్‌పోయెమ్స్‌ని పవన్ కే వర్మ ఆంగ్లానువాదం తోడ్పాటుతో ఆకుపచ్చ కవితలు పేరుతో తెలుగులోకి అనువదించారు వారాల ఆనంద్. మధురాంతకం నరేంద్ర రాసిన మనో ధర్మపరాగం నవలకు తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.