విశాఖవాసులకు శుభవార్త
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలను విశాఖలో ప్రారంభించింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్.. తాజాగా ఏపీ రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖలో ఈ సేవలను అమల్లోకి తెచ్చింది. తమ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన 18వ నగరం విశాఖ అని ఎయిర్టెల్ పేర్కొంది. 4జీ సేవలు పొందుతున్న కస్టమర్లు ఉచితంగానే 5జీ సేవలు పొందొచ్చు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న సిమ్‌కార్డు కూడా మార్చాల్సిన అవసరం లేదు. 5జీ సపోర్ట్‌తో కూడిన మొబైల్ మీరుంటున్న ప్రాంతంలో 5జీ నెట్వర్క్ ఉంటే ఈ సేవలను ఆనందించొచ్చని ఎయిర్టెల్ తెలిపింది.