Breaking NewsHome Page SliderTelangana

ఎంఎం కీరవాణికి మాతృవియోగం

టాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తల్లి భానుమతి బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భానుమతిని కుటుంబ సభ్యులు 3 రోజుల క్రితం కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. భానుమతి భౌతికకాయాన్ని మరికాసేపట్లో ఎస్‌ఎస్‌ రాజమౌళి నివాసానికి తరలించనున్నారు. తల్లి మృతితో కీరవాణి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. మాతృమూర్తి మరణంతో తీవ్ర శోకంలో ఉన్న ఎంఎం కీరవాణి కుటుంబ సభ్యులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే.. కీరవాణి తల్లి దర్శకుడు రాజమౌళికి పిన్ని అవుతారు.