హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయ్. 68 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 39 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక బీజేపీ 26 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మూడు చోట్ల స్వతంత్రులు ఆధిక్యం కనబర్చుతున్నారు. హిమాచల్‌లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లాలని ఆ పార్టీ యోచిస్తోంది. బీజేపీ తిరుగుబాటునేతలు నలాగఢ్ నుండి కెఎల్ ఠాకూర్, డెహ్రా నుండి హోష్యార్ సింగ్, బంజార్ నుండి హితేశ్వర్ సింగ్; హమీర్‌పూర్‌లో కాంగ్రెస్ రెబల్ ఆశిష్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారేలా కన్పిస్తున్నాయ్. మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి రెబల్స్ నుంచి ఇబ్బంది కలుగుతోంది.

హిమాచల్ ప్రదేశ్ థ్రిల్లర్‌గా మారుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ సాగుతున్నప్పటికీ… హస్తం పార్టీ ఆధిక్యత కనబర్చుతోంది. కొండ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఓటు వేయని సంప్రదాయానికి అక్కడి ప్రజలు కట్టుబడి ఉన్నట్టుగా కన్పిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా, అది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య అధికారం ప్రతి ఐదేళ్లకోసారి మారుతూ వస్తోంది. బీజేపీ ఏం చేస్తోందోనన్న వర్రీలో ఉన్న హస్తం పార్టీ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించవచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇండిపెండెంట్లు కూడా మూడు సీట్లు గెలుచుకునేలా ఉన్నారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్రులపై బీజేపీ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 68 మంది సభ్యుల సభలో ఏ పార్టీ ఐనా… మెజారిటీ మార్క్ 35 చేరుకోవాలి. 2019 సార్వత్రిక ఎన్నికలలో, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి 61 శాతం ఓట్ల వచ్చాయి. ఇది దేశంలోనే అత్యధికం. ఉదయం ఐతే ప్రస్తుతం రెండు పార్టీలకు 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చినట్టు కన్పిస్తోంది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్‌లకు కేవలం 43 శాతం ఓట్లు మాత్రమే కన్పిస్తోంది.

2017 అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీ 44 స్థానాల్లో విజయం సాధించిగా… కాంగ్రెస్‌కు 21 స్థానాలను, రెండు చోట్ల ఇండిపెండెంట్లు, ఒక చోట సీపీఎం విజయం సాధించాయి. ఈసారి బీజేపీకి రెబల్స్ బెడద ఎక్కువయ్యింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పెద్ద దిక్కుగా ఉన్న మాజీ రాజకుటుంబం, ఆరుసార్లు ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మృతి చెందడంతో, కాంగ్రెస్ పార్టీకి ఆయన భార్య ప్రతిభా సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వారి కుమారుడు విక్రమాదిత్య సింగ్ ముందుకు నడిపించారు. ఈ ఏడాది ఆరంభంలో పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో విజయం సాధించి కొంత సందడి చేసిన తర్వాత ఆప్ కనిపించడం లేదు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌పై ఫోకస్ పెడితే, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బ తగులుతుందేమోనన్న బెంగలో ఉన్న ఆ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ చేదు ఫలితాలను నమోదు చేస్తోంది.