పవన్ బస్సుయాత్రకు ‘వారాహి’ సిద్ధం
త్వరలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంలో బస్సు యాత్రను చేపట్టనున్నారు. బస్సు యాత్రకు ఉపయోగించే భారీ వాహనం రెడీ అయింది. హైదరాబాద్‌లో పవన్ ట్రయల్ రన్ చేసి స్వయంగా పర్యవేక్షించి వాహనాన్ని పరిశీలించారు. ట్రయల్ రన్ వీడియో, ఫోటోలను పవన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరు పెట్టినట్టు పవన్ వెల్లడించారు. ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధమైంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అయితే.. ఈ బస్సు చూడ్డానికి మిలిటరీ వాహనంలా కనిపిస్తోంది. ఈ వాహనంలో పవన్‌కు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ బస్సులో హై సెక్కూరిటీ సిస్టమ్‌తోపాటు, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్‌ను పొందుపరిచారు.
