InternationalNews

అమెజాన్‌లో మరో 20 వేల మందికి ఉద్వాసన

ఈ-కామర్స్‌లో టాప్‌ రేటింగ్‌లో నిలిచిన అమెజాన్‌ టాప్‌ మేనేజర్లతో పాటు 20 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్‌, టెక్నాలజీ రంగాల్లో పని చేస్తున్న 10 వేల మంది సిబ్బందితో సహా 20 వేల మందిపై వేటు వేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మాంద్యం, ఆదాయం తగ్గుముఖం పట్టడంతో రిటైల్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగాల్లో వ్యాపారం కుంటుపడటంతో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ వర్కర్లు, టెక్నాలజీ సిబ్బంది, కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లతో సహా పలువురి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వేటు వేయాలనుకున్న ఉద్యోగులకు 24 గంటల ముందు నోటీసు జారీ చేయడంతో పాటు పరిహార ప్యాకేజీని కూడా సెటిల్‌ చేసి ఇంటికి పంపిస్తారు. మెటా, ట్విట్టర్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు కూడా ఇటీవల లేఆఫ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెజాన్‌ 20 వేల మందిపై వేటు వేస్తే ఈ కార్పొరేట్‌ సంస్థ 6 శాతం ఉద్యోగులను తగ్గించుకున్నట్లు అయింది.