InternationalNews

సిరియాలో ఐసిస్‌ చీఫ్‌ హతం

సిరియాలో తిరుగుబాటుదారుల చేతిలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్‌ అల్‌ హషిమీ అల్‌ ఖురేషీ హతమయ్యారు. ఈ విషయాన్ని ఓ ఆడియో సందేశం ద్వారా వెల్లడించిన ఐసిస్‌.. కొత్త నాయకుడిగా అబూ అల్‌ హుస్సేన్‌ అల్‌ హుస్సేనీ అల్‌ ఖురేషీని ఎన్నుకున్నట్లు ప్రకటించింది. హసన్‌ అల్‌ హషిమీని అక్టోబరు నెల మధ్యలో దక్షిణ సిరియాలో తిరుగుబాటుదారులు హతమార్చారని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. ఐసిస్‌ చీఫ్‌గా 9 నెలల క్రితమే బాధ్యతలు చేపట్టిన హసన్‌ అల్‌ హషిమీ కంటే ముందు అబు ఇబ్రహీం ఖురేషీ చీఫ్‌గా వ్యవహరించారు. అతడిని అమెరికా దళాలు సిరియాలో చంపేశాయి.