మూడో వన్డే రద్దు…. న్యూజిలాండ్‌దే సిరీస్..
మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన మూడో వన్డే వర్షం కారణంగా నిలిపివేశారు. ఆట కొనసాగే పరిస్థితులు అనుకూలించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. దీంతో 1-0తో సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు గెలుచుకుంది. మొదటి మ్యాచ్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించగా… రెండో వన్డే కూడా వర్షం కారణంగా రద్దయింది. మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 104 పరుగులు చేశారు. ఇంతలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఎడాతెరిపి లేకుండా వర్షం కురవడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేశారు.

