సిసోడియా సన్నిహితుడి అరెస్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఉచ్చు మరింత బిగుస్తోంది. సిసోడియా అనుచరుడు, ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో బడ్డీ రిటైల్ ప్రైవేట్ సంస్థ యజమాని అయిన అరోరా 9వ నిందితుడిగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి అరోరా కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ విచారణలో బయటపడింది. లిక్కర్ లైసెన్సులు ఇచ్చేందుకు అరోరా భారీగా డబ్బులు వసూలు చేసి.. ఆ డబ్బులను ఇతర సంస్థలకు మళ్లించాడని తెలిసింది. ఈ స్కామ్‌లో ఇప్పటి వరకు ఆరుగురు అరెస్టు అయ్యారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికే దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారాడు. అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ స్కామ్‌తో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి లింకులు ఉన్నాయనే విషయం తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో పలువురిని అరెస్టు కూడా చేశారు.