పులిబిడ్డల్లా పోరాడతాం.. అధికారాన్ని సాధిద్దాం… ఈటల
కేసీఆర్ పోలీసుల సాయంతో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర అడ్డుకోవాలని చూశాడని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కోర్టు అనుమతితో సభ నిర్వహించకోగలిగామన్నారు. బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దుస్థితి నిత్యం చూస్తూనే ఉన్నామన్నారు. చదువులమ్మ ఒడిలో విద్యార్థులు హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. విద్యార్థుల ఉద్యమాలకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ దిగొచ్చాడన్నారు. ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారని… వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఒడగొట్టడమే లక్ష్యంగా ఉన్నారన్నారు. కేసీఆర్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని.. చేతలు మాత్రం గుమ్మం కూడా దాటడం లేదన్నారు. కేసీఆర్ డైరెక్షన్లో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు ఈటల. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితీరుతుందన్నారు ఈటల. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ ప్రజలు పులిబిడ్డల్లా బీజేపీ గెలుపు కోసం పనిచేయాలని ఈటల పిలుపునిచ్చారు.


