NewsTelangana

ఈడీ, ఐడీ దాడులంటే భయంలేదు.. హైదరాబాద్‌లో ఉంటాం-తలసాని

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులకు సంబంధింటి టీఆర్ఎస్ స్పందించింది. ఈడీ, ఐటీ దాడుల జరుగుతాయని ముందే అంచనా వేశామని.. సీఎం కేసీఆర్ ఇప్పటికే సమాచారం అందించారన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలో ప్రజస్వామ్య విరుద్ధంగా వ్యవస్థలు నడుస్తున్నాయా అన్పిస్తోందన్నారు. టార్గెట్ చేసుకొని కొందరిపై దాడులు చేస్తున్నారన్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ.. ఇలా టార్గెట్ చేయడం న్యాయం కాదన్నారు. కేంద్ర సర్కారు కొందరిని సెలక్ట్ చేసుకొని దాడులు చేయిస్తోందన్న వర్షన్ విన్పించారు తలసాని.

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని.. హైదరాబాద్ విడిచి వెళ్లే ఉద్దేశం లేదని.. ఐటీ, ఈడీ దాడులకు భయపడబోమన్నారు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. రాజకీయ కక్ష సాధింపుపై టీఆర్ఎస్ పార్టీ, నాయకత్వం గట్టిగా ఫైట్ చేస్తాయన్నారు. ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి… ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామన్నారు. దేశమంతటా ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు తలసాని. వ్యవస్థ చేతిలో ఉన్నంత మాత్రమే దాడులు సమంజసం కాదన్నారు. ఇవాళ మీచేతిలో, రేపు మా చేతిలో కూడా ఉంటాయన్నారు. దాడులు రోటీన్‌గా చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరని… టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం చేసుకొని జరుగుతున్నందువల్లే స్పందించాల్సి వస్తోందన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమన్నారు.

ఇవాళ తెల్లవారుజాము నుంచే మంత్రి మల్లారెడ్డికి చెందిన అనేక ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయ్. మల్లారెడ్డితోపాటు ఆయన కుమారుడు, అల్లుడికి సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 50 బృందాల్లో మొత్తం దాడుల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. దూలపల్లిలోని మల్లారెడ్డి కాలేజీలో నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.