NewsTelangana

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన లేదు

టీఆర్‌ఎస్‌ రౌడీయిజానికి పాల్పడుతోందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిని ఆయన పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి ఘటనపై అర్వింద్‌ కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చే ఉద్దేశ్యం తమకు లేదని… బీజేపీకి తెలంగాణ సమాజం అండగా వుంటుందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. సానుభూతి కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. కావాలనే టీఆర్‌ఎస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన కూడా లేదని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉన్న వారినే బీజేపీలోకి చేర్చకుంటామన్నారు. భయపెట్టి పార్టీలో చేర్చుకునే సంస్కృతి బీజేపీకి లేదన్నారు. పార్టీ ఫిరాయింపులపై మొట్ట మొదటి కేసు పెట్టాలంటే కేసీఆర్‌ మీదనే పెట్టాలని కేంద్ర మంత్రి అన్నారు.