NewsTelangana

సంచల వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌ రెడ్డి

ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ పదవితో సంతృప్తిగా లేదని, అదే ఎమ్మెల్యే పదవి ఉంటే ఏదో చేసే వాడిని అని హుజూరాబాద్‌ ప్రజలకు చెబుతున్నారు. ఎలాగో హుజురాబాద్‌ సీటు కేసీఆర్‌ తనకు ఫిక్స్‌ చేశారని, మీకు దండం పెడతా వచ్చే ఎన్నికల్లో తనని గెలిపించాలని కౌశిక్‌ రెడ్డి అక్కడి ప్రజలని కోరుతున్నారు. వీణవంక మండలం కొండపాక గ్రామంలో కొత్త గ్రామ పంచాయతి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  “ఈ సారి నాకు ఓటేయండి. గెలిపించండి. హుజురాబాద్‌ని హైదరాబాద్‌ మాదిరిగా తీర్చిదిద్దుతా. నన్ను నమ్మండి. కేసీఆర్‌గారిని గెలిపించినట్టుగా భావించి నన్ను గెలిపించండి” అంటూ ప్రాధేయపడ్డారు.