భారత్‌లో ‘మెటా’ హెడ్‌గా సంధ్యా దేవనాథన్
అమెరికాలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘మెటా’ ఇండియా హెడ్‌గా సంధ్యా దేవనాథన్ నియమితులయ్యారు. మెటాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఉన్నాయి. స్కేలింగ్ వ్యాపారాలు, అసాధారణమైన, సమగ్రమైన బృందాలను నిర్మించడం, ఉత్పత్తి ఆవిష్కరణలు, బలమైన భాగస్వామ్యాలను నిర్మించడంలో సంధ్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని.. అందుకే భారత దేశానికి ఆమెను కొత్త నాయకురాలిగా నియమించామని మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ తెలిపారు. కొత్త బాధ్యతలను ఆమె జనవరి 1, 2023న చేపడతారని పేర్కొన్నారు.

మహిళలను ప్రోత్సహించడంలో ముందున్న సంధ్య..
మెటాలో 2016లో చేరిన సంధ్యా దేవనాథన్.. సింగపూర్, వియత్నాం దేశాల్లో ఆ సంస్థ వ్యాపారాలు చూసుకున్నారు. ఆగ్నేయాసియాలో మెటా ఈ-కామర్స్ కార్యక్రమాల్లో కూడా ఆమె సేవలందించారు. ఈ రంగంలో ఆమెకు 22 ఏళ్ల అనుభవం ఉంది. మెటా కోసం అతిపెద్ద వర్టికల్స్‌లో ఒకటైన APAC కోసం సంధ్య 2020లో లీడ్ గేమింగ్‌కు వెళ్లారని సంస్థ తెలిపింది. మెటా ఇండియా హెడ్‌గా అజిత్ మోహన్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. మెటా సంస్థలో మహిళల నాయకత్వంలో కార్యాలయంలో వైవిధ్యాన్ని ప్రోత్సహించడంలో సంధ్య ముందున్నారు. ప్రస్తుతం మెటాలో సంధ్య ఉమెన్@APACకి ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు.

