ఎల్.రమణకు ఈడీ నోటీసులు
చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆయనతో సంబంధాలున్న వారి గురించి ఆరా తీస్తోంది. క్యాసినో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని రమణను ఈడీ ఆదేశించింది. క్యాసినో వ్యవహారంలో ఇప్పటికే ఓ దఫా పలువురిని ఈడీ అధికారులు విచారించారు. తాజాగా ఎల్. రమణకు ఈడీ నోటీసులు ఇవ్వడం కీలకంగా మారింది.