కమలం పార్టీలోకి మర్రి శశిధర్ రెడ్డి?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు డీకే అరుణ కూడా ఉన్నారు. కొన్ని రోజుల నుంచి ఆయన పార్టీ మారబోతున్నారనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మర్రి మండిపడ్డారు. కాంగ్రెస్‌లో కల్లోలానికి రేవంత్ కారణమని, కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా పనులు చేస్తున్నారన్నారు. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌కు రేవంత్ ఏజెంట్‌లా మారిపోయారన్నారని తీవ్రంగా విమర్శలు చేశారు మర్రి శశిధర్ రెడ్డి.

