జైలు పాఠాలు… కాంట్రవర్శీలు వద్దంటున్న సంజయ్ రౌత్
మూడు నెలలకు పైగా జైలు నుండి విడుదలైన ఒక రోజు తర్వాత, టీమ్ థాకరే ముఖ్యనేత సంజయ్ రౌత్ ఇవాళ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రశంసించారు, జూన్‌లో ఉద్ధవ్ థాకరే స్థానంలో సేన తిరుగుబాటుదారుడు ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడం వెనుక ఉన్న శక్తిగా భావించే బిజెపి నాయకుడిని కీర్తించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఉంది, అది కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. వ్యతిరేకించడం కోసం మేము వ్యతిరేకించం. దేవేంద్ర ఫడ్నవీస్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. వీలైనప్పుడల్లా జైలులో వార్తాపత్రికను చదువనన్నారు. పేదలకు గృహనిర్మాణం వంటి నిర్ణయాలు మంచివన్నారు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి మరిన్ని హక్కులు కల్పించాలనే నిర్ణయాన్ని కూడా రౌత్ ప్రశంసించారు. మా ప్రభుత్వం ఆ హక్కులను తొలగించింది. అది నాకు నచ్చలేదు. మిస్టర్ ఫడ్నవిస్ వాటిని పునరుద్ధరించి మంచి పనిచేశారన్నారు. ఫడ్నవీస్‌తో “కొన్ని ప్రజా పనులకు సంబంధించి” కలుస్తానని చెప్పారు రౌత్. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కూడా కలుస్తానన్నారు. నాకు ఏమి జరుగుతుందో వారికి చెబుతాను. దేవేంద్ర ఫడ్నవిస్ రాజకీయ ద్వేషాలు తగ్గించుకోవాలని చెప్పినట్లు నేను చదివాను. ఆ ప్రకటనను స్వాగతిస్తున్నానన్నారు.
రాజ్యసభ సభ్యుడైన ఫైర్‌బ్రాండ్ జర్నలిస్టు-రాజకీయవేత్త, ఐదు నెలల క్రితం ఏక్‌నాథ్ షిండే విడిపోయినప్పుడు థాకరేలను దూకుడుగా సమర్థించారు. 103 రోజుల జైలు జీవితం తర్వాత బెయిల్ పొందిన మిస్టర్ రౌత్ ఉద్ధవ్ ఠాక్రేను అతని ఇంటిలో కలవడానికి ముందు మీడియాతో మాట్లాడారు. టీమ్ థాకరే మిత్రపక్షమైన ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను కూడా కలుస్తానని చెప్పారు. మూడు నెలల్లో ప్రజలు నన్ను మర్చిపోతారని అనుకున్నాను. కానీ నిన్న విడుదలైనప్పటి నుండి నాకు చాలా కాల్స్ వచ్చాయన్నారు. ఉద్ధవ్ జీ నాతో క్రమం తప్పకుండా టచ్ లో ఉండేవారు. పవార్ సాబ్ కూడా నాతో ఫోన్‌లో మాట్లాడారన్నారు. మనీలాండరింగ్‌కు సంబంధించి దర్యాప్తు సంస్థ ED ఎటువంటి ఆధారాలు ఇవ్వనందున తన అరెస్టు తప్పు అని కోర్టు ఆదేశంపై ఎక్కువ మాట్లాడేందుకు నిరాకరించారు. హౌసింగ్ ప్రాజెక్టులో కుంభకోణానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ED పై వ్యాఖ్యానించనన్న రౌత్… తను జైల్లో గడపడం కొందరికి సంతోషాన్నిచ్చి ఉండొచ్చన్నారు.

తన హృదయంలో ఎవరిపైనా పగ లేదన్న రౌత్… కుటుంబం చాలా కష్టాలు పడిందన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అవి సహజమన్నారు. మొత్తం వ్యవస్థను నిందించబోన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థను దేన్నీ కూడా నిందించనన్నారు. వారికి మంచి పనులు చేసే అవకాశం వచ్చినప్పుడు, వారు చేయాలన్నారు, అయితే తర్వాత, ఉద్ధవ్ థాకరే ఇంటికి వచ్చాక… రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలు పెంపుడు జంతువుల్లా పనిచేయరాదన్నారు. అరెస్టుకు ముందు.. స్వాతంత్రానికి పూర్వం 150 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి రాజకీయ ప్రతీకారాన్ని చూడలేదని.. ఢిల్లీ నుండి వచ్చిన ఆదేశాలతో అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. జైలులో ఉన్న సమయంలో అనారోగ్యంతో ఉన్నానన్నారు. జైలు సంతోషకరమైన సమయం కాదని… గోడలతో మాట్లాడాల్సి ఉందన్నారు. బయటి ప్రపంచంతో ఉన్న సంబంధాలన్నీ పోతాయని. ఒంటరితనంలో, గోడలతో మాట్లాడవలసి ఉంటుందన్నారు. ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపిన వీడీ సావర్కర్, బాలగంగాధర్, అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు. రాజకీయాల్లో ఎవరున్నా ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పానన్నారు.

