గుజరాత్‌లో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. గుజరాత్ సీఎం పటేల్ ఘట్లోడియా నుంచి పోటీ చేస్తారు. మాజీ సీఎం విజయ రుపానీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. పోటీ చేయబోవడం లేదని ఆయన ప్రకటించారు. వంతెన కూలి 140 మంది మరణానికి కారణమైన మోర్బిలో అక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని.. మాజీ ఎమ్మెల్యేకు కాంతీలాల్ అమృతియకు బీజేపీ టికెట్ కేటాయించింది.

