NationalNews

సారీ చెప్పనంటే చెప్పను… కర్నాటక కాంగ్రెస్ నేత క్లారిటీ

హిందు పదం పట్ల వివాదాస్పద వ్యాఖయ్లు చేసిన కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ జార్కిహోలీ మరింత దారుణానికి ఒడిగడుతున్నాడు. అనేక పుస్తకాలలో ‘హిందూ’ అనే పదం “పర్షియన్” మూలాల నుంచి తీసుకున్నారని.. తనా తప్పు చేసినట్టు ఎవరైనా నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రతిపాదించారు. హిందు పదానికి సంబపంధించి జార్కిహోలీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రచ్చకు కారణమయ్యాయి. నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఈ పర్షియన్ పదం… హిందూ ఎలా వచ్చిందనే దానిపై వందలాది రికార్డులు ఉన్నాయన్నారు. స్వామి దయానంద్ సరస్వతి పుస్తకం ‘సత్యార్థ ప్రకాష్’, డాక్టర్ జిఎస్ పాటిల్ పుస్తకం ‘బసవ భారత’ , బాల గంగాధర తిలక్ పుస్తకంలో ఇది ప్రస్తావించబడిందన్నారు. ‘కేసరి’ వార్తాపత్రికలో కూడా ఇది ఉందన్నారు. . ఇవి కేవలం 3-4 ఉదాహరణలు మాత్రమేనని… వికీపీడియా లేదా ఏదైనా వెబ్‌సైట్‌లో ఇలాంటి కథనాలు చాలా అందుబాటులో ఉన్నాయిన్నారు. దయచేసి చదవండంటూ వీడియో ప్రకటన రిలీజ్ చేశారు.

మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను తప్పని నిరూపిస్తే శాసనసభ్య పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు. నేను తప్పుచేశానని అందరూ నిరూపించండి.. తప్పు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, క్షమాపణ చెప్పడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. Mr జార్కిహోళి, ఎమ్మెల్యేగా కాకుండా, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్, మునుపటి జనతాదళ్ సెక్యులర్-కాంగ్రెస్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. బెళగావి జిల్లాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో హిందు పదం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

“హిందూ” అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉందని, భారతదేశంతో సంబంధం లేని పదాన్ని ప్రజలు ఎలా అంగీకరిస్తారంటూ విమర్శలుగుప్పించారు. “హిందూ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? అది మనదేనా? ఇది పర్షియన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ప్రాంతానికి చెందినది. హిందూ అనే పదానికి భారత్‌తో సంబంధం ఏమిటి? అలాంటప్పుడు మీరు దానిని ఎలా అంగీకరిస్తారన్నారు. మొత్తం వ్యవహారంపై డిబేట్ జరగాలన్నారు. హిందువు అర్థం తెలుసుకుని సిగ్గు పడతావన్నారు.
ఈ వ్యాఖ్య కర్నాటక రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఇది మైనారిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నమని బీజేపీ అభివర్ణించింది. ఐతే జార్కిహోలీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఒక్కరంటే ఒక్కరు కూడా సమర్థించలేదు.

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యలను ఖండించారు. ఓటర్లను మభ్యపెట్టి మైనారిటీ ఓట్లను పొందాలని కలలు కంటున్నారని, ఇది దేశ వ్యతిరేకమని, దీనిని అందరూ ఖండించాలని, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య మౌనం సతీష్ జార్కిహోళి ప్రకటనలను సమర్థిస్తోందా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రకటనను మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కురువృద్ధుడు బీఎస్ యడ్యూరప్ప కూడా తీవ్రంగా విమర్శించారు. “సతీష్ జార్కిహోళి చెప్పినదాన్ని ఖండించాలి. కాంగ్రెస్ స్వయంగా ఖండించింది. కానీ అది సరిపోదు. కాంగ్రెస్, సతీష్ జార్కిహోళి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానన్నారు యడియూరప్ప.

ప్రజల మనోభావాలను కాంగ్రెస్ గౌరవించాలని కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్నారయణ్ సిఎన్ అన్నారు. వారు గందరగోళం సృష్టించడం తగదని, మనోభావాలను గౌరవించాలన్నారు. విమర్శించే బదులు సంస్కృతిని గౌరవించండి, అనవసర వివాదాలు సృష్టించవద్దని, ఇది సమాజ ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. “హిందూత్వం ఒక జీవన విధానం & నాగరికత వాస్తవికత. ప్రతి మతం, విశ్వాసం మరియు విశ్వాసాన్ని గౌరవించేలా కాంగ్రెస్ మన దేశాన్ని నిర్మించింది. ఇది భారతదేశ సారాంశమంటూ ట్వీట్ చేశారు. కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా. “సతీష్ జార్కిహోళి ఆపాదించబడిన ప్రకటన చాలా దురదృష్టకరం & తిరస్కరించబడటానికి అర్హమైనదంటూ ట్వీట్ చేశారు.