13వ రౌండ్ కూడా టీఆర్ఎస్దే
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమైంది. 2, 3 రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలో కారు బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. ఇక ఆధిక్యత ఎంత అన్నదే సస్పెన్స్‌గా మారింది. 13వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 6,618 ఓట్లు, బీజేపీకి 5,346 ఓట్లు పడ్డాయి. 13వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్కు 88,708 ఓట్లు, బీజేపీకి 79,580 ఓట్లు, కాంగ్రెస్‌కు 19,415 ఓట్లు, బీఎస్పీకి 2,886 ఓట్లు పోలయ్యాయి. దీంతో 13 రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ ఆధిక్యత 9.136 ఓట్లకు చేరింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.