10వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌దే లీడ్
మునుగోడు ఉప ఎన్నికలో 10వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యత సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 7499 ఓట్లు, బీజేపీకి 7015 ఓట్లు పడ్డాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్ 484 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తానికి 10 రౌండ్ల కౌంటింగ్ తర్వాత టీఆర్‌ఎస్ అభ్యర్థి 4,416 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తొలి 2, 3 రౌౌండ్లు మినహా ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ స్వల్ప ఆధిక్యత సాధిస్తూ వస్తోంది. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం దిశగా అడుగులేస్తున్నారు. 11, 12, 13 రౌండ్లలో మర్రిగూడ మండల ఓట్లను లెక్కిస్తారు.

