NewsTelangana

ఈసీ తీరు సరిగ్గా లేదు

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యత సాధిస్తేనే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ ఫలితాల వెల్లడిపై సీఈవో తీరును ఆయన తప్పుబట్టారు. ఎప్పడూ జరగని ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ఫలితాల్లో తేడా వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రౌండ్ల వారీ ఫలితాల్లో ఆలస్యంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కిషన్ రెడ్డి ఫోన్‌ చేసి చెప్పిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈసీ అప్‌డేట్‌ చేశారు.