విశ్వక్సేన్ ఓ వెధవ.. పనికిమాలినోడు…మరో హీరోతో సినిమా చేస్తా-అర్జున్
42 ఏళ్ల సినీ చరిత్రలో విశ్వక్ సేన్ లాంటోడ్ని చూడలేదన్నారు సీనియర్ నటుడు అర్జున్. కొన్ని రోజులుగా సినిమా చిత్రీకరణ విషయంలో అర్జున్‌తో విశ్వక్ సేన్ గొడవపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అర్జున్ మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ సిద్ధం చేసుకున్నాక.. షూటింగ్ రద్దు చేయండంటూ మేసేజ్ పంపించాడని.. దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యానన్నారు. సినిమా తర్వాత షెడ్యూల్ కోసం అంతా సిద్ధం చేశాక.. సారీ షూటింగ్ క్యాన్సిల్ చేయాలంటూ మేసేజ్ రావడంతో హతాశయుడిని అయ్యానన్నారు. సినిమా అనుకున్న విధంగా సాగుతోందని.. ఎలాంటి సమస్యలు లేవని.. విశ్వక్ సేన్ ప్రవర్తనతో జీర్ణించుకోలేకపోయానన్నారు.

మంచి సినిమా తీయాలని వస్తే.. ఇలా చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు అర్జున్. ఇలాంటి వ్యక్తితో సినిమా చేయాలనుకోవడంలేదన్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు, చంద్రబోస్ పాటలు నచ్చలేదంటే అసలు టేస్టేంటో అర్థం కావడం లేదన్నారు. ఇక అనూప్ రెబెన్స్ అంటే గిట్టడం లేదన్నారు. డైరెక్టర్, నిర్మాతకు మర్యాద ఇవ్వలేదని వాడని విశ్వక్ సేన్ పై అర్జున్ నిప్పులు చెరిగాడు. త్వరలోనే మరో హీరోతో సినిమా మళ్లీ చేస్తానన్నారు. ప్రొడ్యూసర్ గిల్డ్‌లో పెట్టి విశ్వక్ సంగతి తేల్చమంటానన్నారు.

