కేసీఆర్‌కు ఈటల ఫైనల్ వార్నింగ్
కేసీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వళ్లించినట్టుగా ఉందన్నారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. మునుగోడులో ఓడిపోతున్నామని తెలిసే కేసీఆర్ టక్కుటమారా విద్యలు ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికలో కేసీఆర్ నైతికంగా ఓడిపోయారన్నారు ఈటల. టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో చులకనైందన్నారు. దేశాన్ని న్యాయవ్యవస్థ కాపాడాలని చెప్తూ కేసీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్తున్న బాధంతా ఎనిమిదిన్నరేళ్లుగా తెలంగాణ సమాజం అనుభవిస్తోందన్నారు. తెలంగాణ గౌరవాన్ని కేసీఆర్ మట్టిలో కలిపారని… అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ త్యాగాల పునాదులపై ఏర్పడిందన్న విషయాన్ని మరచి.. చక్రవర్తిలా రాజ్యం నడుపుతున్నారని మండిపడ్డారు ఈటల.

నలుగురు ఎమ్మెల్యేలు పరమ పవిత్రులని.. నిప్పు కనికలు ఎలా అవుతారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 2014-2018 వరకు 25 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. 2018లో 88 మంది ఎమ్మెల్యేలుండగా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ఖతం చేశారని.. 12 మంది ఎమ్మెల్యేలను కలుపుకొని పార్టీని విలీనం చేసుకున్నారన్నారు. ఎమ్మెల్యేల కప్పదాట్లను ప్రోత్సహించి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో కలుపుకున్నారన్నారు. ఫిరాయింపు చట్టాన్ని దేశంలో కేసీఆర్ వాడినట్టుగా ఎవరూ వాడలేదన్నారు రాజేందర్. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట్ల.. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు సంక్షేమ పథకాలకు చెక్కులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారిన వారికి మంత్రి పదవి ఇవ్వడమే ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ఎనిమిదిన్నరేళ్ల నియంతృత్వంపై దేశంలోని హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, వైస్ ఛాన్స్లర్లకు నివేదికలు పంపిస్తామన్నారు ఈటల. తెలంగాణ వచ్చిన వెంటనే టీవీ9, 10టీవీస, మన తెలంగాణ పత్రికలను స్వాధీనం చేసుకోలేదా అని ప్రశ్నించారు ఈటల. ప్రస్తుతం చాలా చానెళ్లు కేసీఆర్ ఆడిస్తోన్నట్టు ఆడటం లేదా అని దెప్పిపొడిచారు ఈటల. ఇన్ని ఘోరాలు చేసి కూడా ప్రజాస్వామ్యం కాపాడాలని పెడబొబ్బలు పెడుతున్నారన్నారు. తీన్మార్ మల్లన్నను 60 రోజులు, జర్నలిస్ట్ రఘును, కాళోజీ టీవీ దాసరి శ్రీనివాస్‌ను 30 రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టలేదా అంటూ దుయ్యబట్టారు రాజేందర్. ఓటుకు నోటు అంటూ రేవంత్ రెడ్డిపై కేసు పెట్టారు.. హుజూరాబాద్‌లో నోటుకు ఆరు వేలు పంచడం ఓటుకు నోటు కాదా అని ప్రశ్నించారు ఈటల. మునుగోడులో 30 వేల ఓట్లను పొందేందుకు.. ఎల్బీనగర్లో సమావేశం పెట్టి.. లాండ్ రెగ్యులర్ చేస్తామని ప్రలోభానికి గురిచేశారన్నారు.

తాండా వాసులకు ఓటేయండని చెప్పుకోవాల్సిన అగత్యం కేటీఆర్‌కు పట్టింద్నారు. ఎమ్మార్వో, ఎండీవోలకు ఫోన్ చేసి.. టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయకపోతే సంగతి చూస్తానంటూ బెదిరిండం ఎలాంటి ప్రజ్వామ్యానికి స్ఫూర్తినిస్తోందన్నారు ఈటల. బీజేపీ నేతలను 36 గంటల ముందు నియోజకవర్గం నుంచి బయటకు పంపిన పోలీసులు… టీఆర్ఎస్ నేతలను పక్కన నిల్చొని ప్రలోభాలకు గురిచేశారన్నారు. అమ్మగారింట్లో ఉన్న నా భార్యను ఊళ్లోంచి అర్ధరాత్రి వేళ వెళ్లగొట్టారన్నారు. రాళ్లతో దాడి చేయడమే ప్రజాస్వామ్యమా అన్నారు ఈటల. చట్టాన్ని చుట్టబండలు చేసి, అధికారులను బానిసలు చేసి, ఎన్నికల్లో లబ్ధి పొందారన్నారు.చూశారు. భార్యాభర్తలు, పీఏల ఫోన్లు వినడం ఏం సంస్కారమన్నారు ఈటల. కేసీఆర్ చిల్లర పనులు చేస్తున్నాడని… కేసీఆర్ దగ్గర బానిసలు మాత్రమే బతకగలరన్నారు. ఉపముఖ్యమంత్రి పదవి దేవుడెరుగు… దళిత మంత్రినే అవమానించారన్నారు. సామాజిక స్పిరిట్ ఉన్నవారెవరూ కూడా కేసీఆర్ చేస్తోంది మంచి అనరన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయకపోవడం దారుణమన్నారు. మునుగోడులో ఓడిపోతున్నామని తెలిసి… ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా ఆడుతున్నారన్నారు.