పోసానికి జగన్ బంపర్ ఆఫర్
ప్రముఖ సినీ రచయిత, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ చైర్మన్‌గా పోసానిని నియమించారు. నియామకానికి సంబంధించిన జీవోను గురువారం విడుదల చేసిన ఐ అండ్ పీఆర్ ఎక్స్ అఫిషియో సెక్రటరీ టి.విజయ్ కుమార్ రెడ్డి ఇతర వివరాలతో మరో ఉత్తర్వు జారీ చేస్తామని పేర్కొన్నారు. అయితే.. ఆ పదవిలో ఆయన ఎంతకాలం ఉంటారో జీవోలో పేర్కొనలేదు. కానీ.. దీని పదవీ కాలం సాధారణంగా ఏడాది ఉంటుందని తెలుస్తోంది. తర్వాత అవసరాన్ని బట్టి దాన్ని పొడిగించే అవకాశం ఉంది. జగన్‌కు వీరాభిమాని అయిన పోసాని సీఎంను విమర్శిస్తే అసభ్యంగా దూషిస్తారు. లోకేష్‌తో పాటు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, మెగా ఫ్యామిలీపై పోసాని దూషణల పర్వం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

