మునుగోడులో పోటెత్తుతున్న ఓటరు, 11 గంటలకు 25.8% పోలింగ్
మునుగోడులో ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ జరిగిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఓటేసేందుకు భారీగా ఓటర్లు బారులుతీరుతున్నారు. పోలింగ్ బూత్‌ల ముందు ఓటరు భారీగా చేరుకుంటున్నారు. ఉపఎన్నికల్లో ఈ తరహాలో పోలింగ్ జరగడం విశేషంగా చెప్పుకోవాల్సిందే. సాయంత్రం 6 గంటల సమయానికి 90 శాతం పోలింగ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. మునుగోడులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఫిర్యాదులపై స్పందించారు సీఈవో వికాస్ రాజ్. ఇప్పటి వరకు నియోజకవర్గంలో సంబంధం లేకుండా ఉన్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు వివరించారు.

