NewsTelangana

పోలింగ్‌ ఏర్పాట్లు షురూ

మునుగోడు ఉప ఎన్నిక కోసం పోలింగ్‌ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పోలింగ్‌ సామాగ్రిని అధికారులు పంచడం ప్రారంభించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఓటర్లకు కొత్త డిజైన్‌తో కూడిన గుర్తింపు కార్డులు ఇచ్చారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, మైక్రో అబ్జర్వర్లతో అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. ఆదివారం 6వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది. పార్టీల పట్టుదలతో ఉద్రిక్తతలు జరిగే ప్రమాదం, అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు చేసే అవకాశం ఉండటంతో ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో నిఘా పెట్టేందుకు వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేసింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు అవకాశం ఉన్న సున్నిత పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు భద్రతను పెంచారు.

మునుగోడు బరిలో.. 47 మంది అభ్యర్థులు

మొత్తం ఓటర్లు.. 2,41,855 మంది

పురుషులు.. 1,21,720, మహిళలు.. 1,20,128

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు.. 5,686

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు.. 298

అర్బన్‌ పరిధిలో.. 35, రూరల్‌ పరిధిలో.. 263

పోలింగ్‌ సిబ్బంది.. 1192, అదనంగా మరో 300

అందుబాటులో 199 మంది మైక్రో అబ్జర్వర్లు

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు.. 50

రాష్ట్ర పోలీసులు 2,500 మంది

కేంద్ర పోలీసులు.. 15 కంపెనీల బలగాలు