రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం. ఇందుకు సోనియా గాంధీ ఆనాడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో ఖర్గే మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయాలని అధికారం ఇస్తే టీఆర్‌ఎస్ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు.
మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్ అని ఖర్గే అభివర్ణించారు. దేశాన్ని విడగొట్టాలని, విద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 13 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా… మోడీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. మరో వైపు.. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ పాలన కొనసాగిస్తుండడం దారుణమన్నారు. అందరూ కలిసి కట్టుగా నిలబడి బీజేపీకి అడ్డు కట్ట వేయాలని కోరారు.

