టీఆర్‌ఎస్ పార్టీతో పొత్తు ఉండదు
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. రానున్న ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని, ఉప ఎన్నికకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయని రాహుల్ మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. భారత్ జోడో యాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిందన్నారు.

