నేరగాళ్ల కంటే పోలీసులు 10 అడుగులు ముందే ఉండాలి
`ఒకే దేశం… ఒకే పోలీస్ యూనిఫాం’ పద్ధతిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రధాని మోదీ ప్రతిపాదించారు. దీని అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకోవాలని సూచించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపీలతో శుక్రవారం నిర్వహించిన `చింతన్ శివిర్’లో మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ఏ రూపంలో ఉన్నా నక్సలిజాన్ని ఓడించాలని మోదీ పిలుపునిచ్చారు. నక్సల్స్ గన్స్ పట్టుకోగలరు.. పెన్స్ పట్టుకోగలరు. వారు యువతను తప్పుదోవ పట్టిస్తారు అని మోదీ తెలిపారు. నక్సలిజం ఘటనలను డీల్ చేయడానికి రాష్ట్రాలు నిపుణులను పంపాలని ప్రధాని సూచించారు. ఆధునిక సాంకేతికత సాయంతో భద్రతా వ్యవస్థను మేటిగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ 5 జీ యుగంలో నేరగాళ్ల కంటే పోలీసులు 10 అడుగులు ముందే ఉండాలన్నారు. చట్టాలు, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ.. నక్సల్స్ అమాయకపు ముఖం పెడతారని తెలిపారు. భద్రతా దళాలు అటువంటి శక్తులను గుర్తించాలన్నారు.